చర్చ : చుంచుపల్లి , ఫీజులు ఆలస్యమైందని విద్యార్థులను బయట నిలబెట్టి వేధింపులు – తల్లిదండ్రుల్లో ఆగ్రహం…
ఫీజులు ఆలస్యమైందని విద్యార్థులను బయట నిలబెట్టి వేధింపులు – తల్లిదండ్రుల్లో ఆగ్రహం
చర్చ, చుంచుపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలంలోని రాంనగర్ పంచాయతీలో గల ఎస్ఆర్ డి జి స్కూల్ యాజమాన్యం ఫీజులు చెల్లించడంలో ఆలస్యమైందన్న కారణంతో కొందరు విద్యార్థులను తరగతులకు అనుమతించకుండా స్కూల్ బయట నిలబెట్టిన ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో చిన్నారులు అవమానానికి గురవడమే కాకుండా, తల్లిదండ్రుల ఆర్థిక స్థితి పట్ల పిల్లలకు ఎటువంటి మానసిక స్థితి ఏర్పడుతుందోనని తల్లిదండ్రులు మానసిక క్షోభకు లోనవుతున్నారని ఆరోపిస్తున్నారు.
విద్య హక్కు అయినప్పటికీ, ఫీజుల పేరుతో పిల్లలను అవమానించడం అన్యాయమని వారు మండిపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమే గాని, చిన్నారుల మనోభావాలపై పడే ప్రభావం దీర్ఘకాలికమని అభిప్రాయపడుతున్నారు. వెంటనే ఈ విధానాన్ని నిలిపివేసి, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.