చర్చ,సింగరేణి :వికె కోల్ మైన్ బొగ్గు ఉత్పత్తిని సింగరేణి కార్మికులు తోనే తియ్యాలి గుర్తింపు

*వికె కోల్ మైన్ బొగ్గు ఉత్పత్తిని సింగరేణి కార్మికులు తోనే తియ్యాలి గుర్తింపు*
*గౌతంఖని ఓపెన్ కాస్ట్ మూసివేసిన తరువాత, సత్తుపల్లికి డిప్యుటేషన్ పై పంపిన కార్మికులను వెంటనే వీకే కోల్ మైన్ లో నియమించాలి*
*సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కి వినతిపత్రం అందచేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు*
చర్చ, సింగరేణి కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియా వీకే కోల్ మైన్ లో శనివారం ఉదయం సంస్థ (సి అండ్ ఎండీ)బుద్ద ప్రకాష్ జ్యోతి, చేతులమీదుగా బొగ్గు రవాణాను ప్రారంభించడానికి వచ్చిన వారిని గుర్తింపు సంఘం ఎఐటియుసి,బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు మరియు కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్ ఆధ్వర్యంలో చైర్మన్ కి వీకే కోల్ మైన్ లో పలు సమస్యలపై వినతిపత్రం అందచేశారు.అనంతరం ఎఐటియుసి నాయకులు మాట్లాడుతూ గౌతంఖని ఓపెన్ కాస్ట్ మూసివేసిన తరువాత జెవిఆర్ ఓసికి డిప్యూటేషన్ పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి వీకే కోల్ మైన్ లో నియమించాలని, అదేవిధంగా కోల్ క్రషర్స్ మరియు బొగ్గు రవాణా అన్నీ కూడా సింగరేణి సిబ్బంది తోనే నడిపించి కొత్తగూడెం ఏరియా మనుగడను కాపాడాలని కోరారు,అదేవిధంగా వీకే కోల్ మైన్ నందు సరిపాడ సిబ్బంది లేక సరైన ఇన్ఫ్రాస్ట్రక్షన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని వాటిపై కూడా దృష్టిసారించి వెంటనే సమకూర్చాలని డిమాండ్ చేశారు,కొత్తగూడెం ఏరియాలోని వికే కోల్ మైన్ ప్రైవేటీకరణ చేసినట్లయితే కొత్తగూడెం లో సింగరేణి కార్మికుల సంఖ్య తగ్గిపోతే కొత్తగూడెం ఏరియా లో ప్రజానీకం మరియు వ్యాపారవర్గం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనుగడ లేకుండా పోతుంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితిలో డిప్యుటేషన్ మీద వెళ్ళిన కార్మికులను తిరిగి వీకే కోల్ మైన్ లో నియమించి వీకే కోల్ మైన్ ను సింగరేణి కార్మికులు తోనే నడిపించి,కొత్తగూడెం ఏరియా మనుగడను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్ రాములు, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ హుమాయిన్, పిట్ కార్యదర్శిలు ఏం ఆర్ కే ప్రసాద్,మధు కృష్ణ,కమల్,సౌజన్య,నాయకులు హీరాలల్, మెంగన్ రవి,బండారి మల్లయ్య,తాతిదారులు పాల్గొన్నారు.