News & Views

చర్చ, భద్రాచలం : ఎటపాక మండలంలో జోరుగా పేకాట.

చర్చ, భద్రాచలం :

*ఎటపాక మండలంలో జోరుగా పేకాట….*
*ఎండ తీవ్రత పెరగటంతో AC రూముల ఏర్పాటు చేసిన భద్రాచలానికి చెందిన పేకాట నిర్వాహకులు….*

భద్రాచలం పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పాటై,ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని,ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రా నుంచి ఆటగాలను రప్పించుకొని జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు.

నిత్యం ఆటగాళ్ల కార్లు ఎటపాక మండలానికి వస్తు పోతు ఉండటంతో రోడ్లు రద్దీగా మారాయి.

ఇటీవల ఒక జర్నలిస్ట్ వాట్సప్ ద్వారా వీరి స్థావరాల గురించి తెలపడం ద్వారా, ఎటపాక నవోదయ స్కూల్ పక్కన జరుగుతున్న వీరి పేకాట శిబిరాన్ని కన్నాయి గూడెంకి మఖం మార్చడం జరిగింది.

ఎటపాక పోలీస్ స్టేషన్ కి అత్యంత దగ్గరలోనే పేకాట స్థావరాలు ఏర్పాటు చేయటం చర్చనీయాంశంగా మారింది.

1) కన్నాయి గూడెం
2) తునికి చెరువు
3) పాలమడుగు
4) కొత్తూరు
5) వెంకట రెడ్డి పేట

ఒక్కో గ్రూపు ఒక్కో ఊరిలో స్థావరాలు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు లక్షల్లో జూదాన్ని నడిపిస్తున్నారు.

ఈ పేకాట జూదంలో ఆటగాళ్ల జేబులు గుల్ల చేసేందుకు ( సెన్సార్ పేకలు ) టెక్నాలజీని కూడా వాడుతున్నట్టు వినికిడి……🤓