News & Views

చర్చ, కొత్తగూడెం : బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??*

చర్చ , కొత్తగూడెం :

*బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??*
జే.బీ.పీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్
*కొత్తగూడెం*: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉందని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యా రంగానికి 15 శాతం నిధులను బడ్జెట్ లో కేటాయిస్తామని హామీ ఇచ్చి కేవలం 8.2 శాతం మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని,ఈ అరకొర నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవని విమర్శించారు.3,24,234 కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వైద్య రంగానికి కేవలం 13679 కోట్లను మాత్రమే కేటాయించి పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని,జాబ్ క్యాలెండర్ పై ప్రస్తావించలేదని,ఆరు గ్యారంటీ ల అమలు పై బడ్జెట్ లో ఎక్కడ ప్రస్తావన లేదని,ఉద్యోగాలకు సంబంధించిన పీఆర్సీ పై ప్రకటన లేకపోవడం దారుణమన్నారు.రాజీవ్ యువ వికాసానికి పోయిన బడ్జెట్ లో 6 వేల కోట్లు కేటాయించి 6 పైసలు కూడా ఖర్చు చేయలేదని దెప్పిపొడిచారు.ఈ బడ్జెట్ అంకెల గారడి తప్ప సామాన్య,పేద ప్రజలకు వొనగూరింది ఏమి లేదని విమర్శించారు.