News & Views

చర్చ, సింగరేణి : సేవ్ సింగరేణి జాతను మరియు ఈ నెల 30న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జరుగు మహాధర్నా ను,వంట వార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

 

సేవ్ సింగరేణి జాతను మరియు ఈ నెల 30న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జరుగు మహాధర్నా ను,వంట వార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

సేవ్ సింగరేణి పోరు జాత పై కొన్ని సంఘాలు విమర్శలు చేయడం సరైంది కాదు.

కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఏఐటియుసి కి సంఘీభావం తెలపకుండ విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం.

అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్యా.

కార్మికుల సమ‌స్యల‌‌‌ పరిష్కారం కోసం ఏఐటియుసి ఏర్పాటు చేసిన సేవ్ సింగరేణి పోరు జాత పై కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేయడం సరైంది కాదని, సంఘీభావం తెలిపి కార్మికుల ఐక్యతను చాటాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పేర్కొన్నారు. సోమవారం శేషగిరిభవన్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పై ఏఐటియుసి సేవ్ సింగరేణి పోరు జాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు. కార్మికుల సమ‌స్యల‌‌‌ ను పరిష్కారం చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కి రావాల్సిన 50 వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా సంస్థ ను నిర్వీర్యం చేస్తుందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి కి కొత్త గనులు ఇవ్వడం లేదని, దీని వల్ల ఉన్న బొగ్గు గనులు మూత పడె అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. సంస్థ కు బకాయిలు వస్తెనే అన్ని కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని వారు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఏఐటియుసి సేవ్ సింగరేణి జాతా పోరాట కార్యక్రమం తీసుకుందని వారు పేర్కొన్నారు. ఈ జాతా పై ఐఎన్టీయుసి, సిఐటియు, హెచ్ ఎం ఎస్ యూనియన్ లు కార్మిక వర్గాన్ని బలహీన పరిచే విధంగా, ఐక్యతను దెబ్బ తీసే విధంగా విమర్శలు చేయడాన్ని వారు ఖండించారు. కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణ కోసం చేస్తున్న ఇట్టి జాతా కు సంఘీభావం తెలపకుండ కార్మిక వర్గాన్ని తప్పు దోవ పట్టించడమేనని వారు పేర్కొన్నారు. పోరు జాతా లో సింగరేణి కార్మికులకు చెందిన డిమాండ్ లు ఉన్నాయని, వాటి పరిష్కారానికి పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు.ఈ జాతా ఈ నెల 30 వరకు కొనసాగుతుందని, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు వంట వార్పు, ముట్టడి కార్యక్రమం ఉంటుంది దీనిని విజయవంతం చేయాలని వారు కోరారు. యాజమాన్యం , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పరిష్కారం చూపకుంటే ఎప్రిల్ లో సమ్మెకు పిలుపు నిస్తామని వారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఏఐటియుసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, సముద్రాల సుధాకర్,సహాయ కార్యదర్శులు గట్టయ్య, రాము, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,నితిన్, టి నాగయ్యా,అనంతలక్ష్మి, జే రమేష్, నరేష్,మల్లికార్జున్,భరణి,కమల్,బండారి మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.