News & Views

చర్చ భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సుల తనిఖీలు_

ఫిట్‌నెస్ లేని, నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తామని రవాణాశాఖ హెచ్చరిక_

చర్చ కొత్తగూడెం,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా రవాణాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేస్తున్నారు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల లైసెన్స్, ఇన్సూరెన్స్, అగ్నిమాపక సిలిండర్లు, ప్రథమ చికిత్స కిట్లు, సీసీ కెమెరాలు, జీపీఎస్, అత్యవసర ద్వారాలు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని, నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.