ఇసుక లారీ సీజ్ చేసిన పోలీసులు
చర్చ, సత్తుపల్లి

ఆంద్ర నుండి అక్రమంగా హైదరబాదు కు ఇసుక తరలిస్తున్న లారీను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు…ఆంద్రప్రదేశ్ లోని కోవ్వూరు రీచ్ నుండి సరిహద్దు ప్రాంతం సత్తుపల్లి మీదుగా హైదరాబాదు కు ప్రతి నిత్యం పదుల సంఖ్యల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది..ఈ నేపద్యంలో వీ.ఎం.బంజర్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా హైదరాబాదు లోని చర్లపల్లి కి 30 టన్నుల ఇసుక తరలిస్తున్న లారీ ను పట్టుకున్నారు.లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ఇసుక లారీను పోలీసు స్టేషన్ కు తరలించి లారీ ఓనర్ పై కేస్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…అయితే ఇసుక లారీ అని అనుమానం రాకుండా ఇసుక లారీకు బాడీకి సరిపడా టార్పాల్ పట్టా కప్పి రవాణా చేస్తున్నారు.దీంతో ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా జిల్లాలు దాటి హైదరాబాదు కు చెరుకుంటున్నాయి…ఇలా పట్టాలు కప్పి వచ్చే వాహనాలను వీ.ఎం.బంజర్ పోలీసులు పసిగట్టి ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతున్నారు..