News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమం లో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం మేషన్ కాలనీలో డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండే ఆకస్మిక తనిఖీలు…

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు రామవరం లోని మేషన్ కాలనీ నందు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమం లో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం మేషన్ కాలనీలో డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండే ఆకస్మిక తనిఖీలు…

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు రామవరం లోని మేషన్ కాలనీ నందు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరియైన అనుమతి పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు,25 రూ. విలువగల అక్రమ మద్యం బాటిల్స్ ను, 10 వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనంతరం మేషన్ కాలనీలోని గ్రామస్తులతో అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా డిఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాల గురించి తెలుపుతూ భద్రాద్రి జిల్లాలో పూర్తిగా గంజాయి అరికట్టేటందుకే చైతన్యం పేరుతో కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. తల్లీదండ్రులు తమ పిల్లల కదలికలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని సూచించారు.ఎంతో మంది యువకులు మత్తుకు బానిసలై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎవరైనా గంజాయిని అమ్మినా,రవాణా చేసినా అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.అనంతరం అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంది మరియు స్థానికులు చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం ప్రతిజ్ఞ చేశారు.

DSP కొత్తగూడెం , అబ్దుల్ రెహమాన్…