News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల అండర్ర్ బ్రిడ్జి వద్ద ట్యాంకర్ బోల్తా – కూలీలకు తప్పిన పెను ప్రమాదం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలోగల అండర్ర్ బ్రిడ్జి వద్ద ట్యాంకర్ బోల్తా – కూలీలకు తప్పిన పెను ప్రమాదం…

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. కొత్తగూడెం రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద విజయవాడ వైపు వెళ్తున్న ఒక ట్యాంకర్, అదే సమయంలో రామవరం ప్రాంతానికి స్లాబ్ పనుల కోసం బయలుదేరిన టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో ట్యాంకర్ బోల్తా పడటంతో అదృష్టవశాత్తు కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారని కూలీలు తెలిపారు.

సంఘటన సమయంలో అక్కడి దృశ్యాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మద్యం మత్తు, నిద్ర మత్తు లేదా అతివేగం కారణమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా వాహనాదారులు భయభ్రాంతులకు గురయ్యారు.
గతంలో కూడా ఇదే ప్రాంతంలో ట్యాంకర్ బోల్తాపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం గుర్తుండగానే, మరోసారి ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.