News & Views

చర్చ : మర్రిగూడెంలో దారుణ హత్య – గ్రామంలో కలకలం , వాగులో పడేసిన గ్రామ పెద్ద మృతదేహం – భూ వివాదమే హత్యకు కారణమా..?

మర్రిగూడెంలో దారుణ హత్య – గ్రామంలో కలకలం.

వాగులో పడేసిన గ్రామ పెద్ద మృతదేహం – భూ వివాదమే హత్యకు కారణమా.. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుని ప్రాంతంలో కలకలం రేపింది.
చుంచుపల్లి మండలంలోని మర్రిగూడెం ఆదివాసి గ్రామానికి చెందిన గొత్తికోయ పద్దం నందయ్య (56) అనే గ్రామ పెద్దను అదే గ్రామానికి చెందిన వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితులు నందయ్యను హత్య చేసి మృతదేహాన్ని గ్రామం సమీపంలోని వాగులో పడేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం స్థానికులు వాగులో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ ప్రతాప్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో భూ వివాదం, మంత్రాల అనుమానం ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.