చర్చ : ఘోర అగ్నిప్రమాదం 25 మంది ప్రయాణికులు స్పాట్ లో మరణం, చిన్నటేకూరు,కల్లూరు మండలం,కర్నూలు జిల్లా…హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు, ఒక బైక్ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది…
ఘోర అగ్నిప్రమాదం...

కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు సమీపంలో బస్సు ఒక బైక్ను ఢీకొనడంతో మంటలు చెలరేగి మొత్తం బస్సు కాలి బూడిదైంది. ఈ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తోంది.