చర్చ : కొల్లాపూర్ , నాగర్ కర్నూల్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి సముద్రం జలాశయం కట్టపై మొసలి సంచారం కలకలం రేపింది…
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి సముద్రం జలాశయం కట్టపై మొసలి సంచారం కలకలం రేపింది.

కంట్రిబ్యూటర్… K.సతీష్
కుమార్
రిపోర్టర్….హరి శంకర్
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీవారి సముద్రం జలాశయం కట్టపై మొసలి సంచారం కలకలం రేపింది. దీంతో పర్యాటకులు భక్తులు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన మత్స్యకారులు తాళ్లతో బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు బంధించిన మొసలిని తీసుకెళ్లి కృష్ణానదిలో విడిచిపెట్టారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు కృష్ణానదికి భారీవరద రావడంతో మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సింగోటం శ్రీవారి సముద్రం జలాశయాన్ని నింపారు. దీంతో శ్రీవారి సముద్రం జలాశయం లో మొసలి సంచరిస్తుంది. అదే మొసలి శ్రీవారి సముద్రం జలాశయం కట్టపైకి వచ్చింది. సింగోటం శ్రీలక్ష్మి నరసింహ ఆలయం పక్కనే ఈ సంచరించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు