చర్చ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, గర్భిణికి ప్రసూతి కష్టం…పసిపాపను ఎత్తుకొని వాగు దాటుతున్న ఈఎంటీ కృష్ణ…
పసిపాపను ఎత్తుకొని వాగు దాటుతున్న ఈఎంటీ కృష్ణ...

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా …
గర్భిణికి ప్రసూతి కష్టం…పసిపాపను ఎత్తుకొని వాగు దాటుతున్న ఈఎంటీ కృష్ణ..
వాగుల అవతల, సరైన రహదారి సౌకర్యం లేని గ్రామాల్లోని గర్భి ణులకు ప్రసూతి కష్టాలు తప్పడం లేదు. పురిటినొప్పుల సమయంలో వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఆసిఫాబాద్ మండలం మారుమూల గిరిజన గ్రామం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని సవాతిగూడకు చెందిన గర్భిణి జాన్కుబాయికి పురిటినొప్పులు వచ్చాయి.కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. గ్రామానికి రోడ్డు లేకపో వడం, మధ్యలో వాగు అడ్డుగా
ఉండటంలో.. వాహనం వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆమెను ద్విచక్ర వాహనంపై వాగు సమీపం వరకు తీసుకొచ్చారు. సుమారు కి.మీకు పైగానే దూరంలో అంబు లెన్సు నిలపాల్సి వచ్చింది. ఈఎంటీ జాదవ్ కృష్ణ, పైలట్ సాయిలు వాగు అవతల కొంత దూరం వరకు కాలినడకన వెళ్లి గర్భిణికి అక్కడే సాధారణ కాన్పు చేశారు. తల్లీబిడ్డలను అక్కడి నుంచి క్షేమంగా వాగు దాటించి ద్విచక్ర వాహనంపై అంబులెన్సు వరకు తీసుకొచ్చి జిల్లా ఆసుప త్రికి తరలించారు.