News & Views

చర్చ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి వెనుక గంజాయి మొక్కను పెంచుతున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు…

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి వెనుక గంజాయి మొక్కను పెంచుతున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి మొక్కను పెంచుతున్న దేశ్ముఖ్ మాధవ్ అనే నిందితుడిని పట్టుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ రాజేష్ మీనా వెల్లడించారు. ఇంటి ఆవరణలో గంజాయి మొక్క పెంచుతున్నాడన్న సమాచారంతో రూరల్ సీఐ కృష్ణ, రూరల్ ఎస్సై లింబాద్రి బృందం వైస్సార్ కాలనీలో తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ తనిఖీలలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం కూడా పాల్గొన్నారని తెలిపారు. దేశముఖ్ మాధవ్ అనే వ్యక్తి తన ఇంటి వెనుక నిషేధిత గంజాయి మొక్కను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారని, నిందితుడికి గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇంటి ఆవరణలో పెంచుతున్న 690 గ్రాముల పచ్చి గంజాయి మొక్క స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయిని పట్టుకోవడంలో కృషిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.