చర్చ : మంచిర్యాల జిల్లా , వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో ఈరోజు నుండి మద్యపానం,గుడుంబా పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్వచ్ఛందంగా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా గ్రామ వేదిక తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు…

మంచిర్యాల జిల్లా..
వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో ఈరోజు నుండి మద్యపానం,గుడుంబా పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్వచ్ఛందంగా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా గ్రామ వేదిక తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు…..
వారు మాట్లాడుతూ.. మా గ్రామంలో ఇకపైన గుడుంబా, మద్యపానం ఎవరైనా అమ్మిన, తయారు చేసిన, గ్రామంలో ఎవరైనా తాగిన గ్రామ వేదిక తీర్మానం మేరకు ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి 50 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు….
పోలీస్, ఎక్సెజ్ శాఖ అధికారులు గుడుంబా, మద్యపానం నిషేధిత గ్రామంగా మేము ప్రకటించుకుంటున్నాం…
మీరు సహకరించాలని గ్రామస్తులంతా ఏకమై గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో పురుషులు, మహిళలు, యువత గ్రామ ప్రజలు సమిష్టి నిర్ణయం తీసుకొని గ్రామస్తుల అందరికి సమక్షంలో ప్రతిజ్ఞ చేశామని గ్రామంలో ఎవరైనా గుడుంబా, బెల్టు షాపులు వారు మద్యం తీసుకువచ్చి అమ్మిన, రవాణా చేసే వ్యక్తులను గ్రామస్తులంతా ఏకమై స్వచ్ఛందంగా వారిని పట్టుకొని పోలీస్ శాఖకు అప్పగిస్తామని తమ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా ఎదగాలని స్వచ్ఛందంగా గ్రామ వేదిక ద్వారా తీర్మానం పిలుపునిచ్చారు….