చర్చ : చింతకాని , ఖమ్మం జిల్లా, కోడ్ తొలగినా…. ముసుగులు తీయలే…

కోడ్ తొలగినా…. ముసుగులు తీయలే…
చింతకాని:- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ను అమలులోకి తీసుకు రావడంతో అధికారులు హడావుడిగా రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసగులు వేశారు. హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికల కోడ్ను ఎత్తివేసింది అయినా అధికారులు మండలంలో విగ్రహాల ముసుగులు తొలగించలేదు. పైన కనిపిస్తున్న ఈ చిత్రం మండల పరిధిలోని కోమట్ల గూడెం గ్రామంలో పలువురు కంటబడి ప్రముఖుల విగ్రహాల పై వేసిన ముసుగుల గురించిగురించి చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ముసుగులు తొలగించాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.