News & Views

చర్చ : వైరా , ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలంలో కాలనీ నాచారంలో దారుణం,కట్టుకున్న భర్తను పిల్లలను, వదిలి వేరొకరితో వెల్లిన భార్య వర్ధనిని గొడ్డలితో నరికి చంపిన భర్త రామారావు…

i 

ఏన్కూరు మండలంలో కాలనీ నాచారంలో దారుణం కట్టుకున్న భర్తను పిల్లలను, వదిలి వేరొకరితో వెల్లిన భార్య  వర్ధనిని గొడ్డలితో నరికి చంపిన భర్త రామారావు..

ఏన్కూర్ మండలం కాలనీ నాచారంలో కట్టుకున్న భర్త, పిల్లలను వదిలి వెల్లి వేరేకరితో సహాజీవనం సాగిస్తున్న భార్యను ఇంటికి తీసుకొచ్చి నచ్చిజెప్పినా వినకపోవడంతో ఆమెను గొడ్డలితో నరికి చంపిన భర్త..దింతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

ఏన్కూర్ మండలం కాలనీ నాచారంకు చెందిన తాటి రామారావుకు అదే గ్రామానికి చెందిన వర్దిని (32)తో సుమారు 16 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది..వారికీ ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. ఈ క్రమంలో వర్ధని అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఏడాది క్రితం భర్త, పిల్లలను వదిలి విజయవాడ వెళ్లి సహజీవనం చేస్తుంది.. ఆతర్వాత పెద్దమనుషులు, గ్రామస్థుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు..మరోసారి ఆరు నెలలుగా అఖిల్ తో వెళ్ళి సత్తుపల్లి సమీపంలో సహజీవనం చేస్తోంది..ఈనెల 22న వర్ధని అఖిల్ తో కలిసి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు వెళ్లింది..విషయం తెలుసుకున్న భర్త రామారావు అక్కడికి వెళ్లి అఖిల్, భార్య వర్దినితో గొడవపడి అఖిల్ ద్విచక్ర వాహనంపై భార్య వర్ధనిని తీసుకుని ఇంటికి వచ్చి ఇక నుంచి కలిసి ఉందామని నచ్చజెప్పినా భార్య వర్దిని వినలేదు.దింతో భార్య వర్దినిపై కోపం పెంచుకున్న రామారావు ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న వర్ధనిని గొడ్డలితో నరికి చంపాడు..వర్ధని తల్లి ముక్తి రాధమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏన్కూర్ పోలీసులు.