News & Views

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం, నిబంధనలకు విరుద్ధంగ గోవులను అక్రమంగా తరిలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన భద్రాచలం పోలీసులు..

నిబంధనలకు విరుద్ధంగ గోవులను అక్రమంగా తరిలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన భద్రాచలం పోలీసులు..ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామమైన గుండాల నుండి భద్రాచలం మీధుగా తప్పుడు ద్రువపత్రాలతో గోవుల్ని హైదరాబాదుకి తరలించి సొమ్ము చేసుకోవాలనుకున్న వారికి ఊహించని షాక్ తగిలింది..పోలిసుల కండ్లు కప్పి గోవులని ధాటించాలనే ఉద్ధేశంతో భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ఆపకుండా తప్పించుకునే అక్రమార్కుల ప్రయత్నానికి చెక్ పెట్టారు విశ్వహింధ్ పరిషత్ కార్యకర్తలు.. అక్రమ రవాణ చేస్తూన్నారని ముందుగానే సమాచారం అందుకున్న విశ్వహింధు కార్యకర్తలు భద్రాచలం చెక్ పోస్ట్ ధాటించి వేగంగా వెలుతున్న వాహనాలని బ్రిడ్జి పై చేధించి పట్టుకుని పోలిసులకి అప్పగించారు..ఈ నేపధ్యం లో పట్టుబడ్డ 12 గోవులను గోశాలకు తరలించి, అక్రమ రవాణా కి పాల్పడ్డ నింధితులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు భద్రాచలం పట్టణ పోలీసులు ..