చర్చ : భద్రాచలం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , వరద బాధితులకు అండగా ఎస్ఎల్బీటీ పెయింట్స్ సంస్థ అండగా నిలుస్తోంది…

వరద బాధితులకు అండగా ఎస్ఎల్బీటీ పెయింట్స్
చర్చ, భద్రాద్రి కొత్తగూడెం:
తుఫాను ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో భద్రాచలం వద్ద వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఎల్ఎల్బీటీ పెయింట్స్ సంస్థ అండగా నిలుస్తోంది. గత మూడు రోజులుగా ప్రతిరోజు రెండు క్వింటళ్ల చొప్పున పులిహోర పొట్లాలను ముంపు ప్రాంత బాధితులకు అందిస్తున్నారు. ప్రతీ యేటా ముంపుప్రాంత ప్రజలకు ఎల్ఎల్బీటీ సంస్థ అధినేతలు శెట్టి వేణురాజ్, భూమ తేజ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాధితులకు తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారు. వారు అందిస్తున్న సేవలపట్ల ముంపు ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారంతోపాటు సామాజిక సేవలో ముందుంటూ నేటి తరం యువతకు వేణురాజ్, భూమ తేజ ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడుతున్నారు.