News & Views

చర్చ, సత్తుపల్లి: మొంథా తుఫాన్ ప్రభావం – సత్తుపల్లి సింగరేణి బొగ్గు ఉత్పత్తి అంతరాయం…

సత్తుపల్లి సింగరేణి బొగ్గు ఉత్పత్తి అంతరాయం...

 

మొంథా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా సత్తుపల్లి పరిధిలోని ఓపెన్‌కాస్ట్ (OC) బొగ్గు గనులపై తీవ్ర ప్రభావం చూపించాయి. వర్షపాతం కారణంగా గనుల్లో నీరు చేరి ఉత్పత్తి నిలిచిపోయింది.

సింగరేణి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓసి1, ఓసీ2 లలో సుమారు 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆటంకం ఏర్పడింది అని రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలిచే పనులకు ఆటంకం ఏర్పడిందిఅని సత్తుపల్లిలో నమోదైన 29 మిల్లీమీటర్ల వర్షపాతం కారణంగా ప్రభావితమైందని అధికారులు తెలిపారు.

వర్షం తగ్గిన తరువాత నీటిని తొలగించి ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు సింగరేణి సంస్థ అధికారవర్గాలు వెల్లడించాయి.