News & Views

చర్చ : అశ్వారావుపేట: నారంవారిగూడెం గ్రామంలో నాలుగు కాళ్ల కోడిపుంజు

బ్రహ్మం గారి కాలం వచ్చిందా ?

 

చర్చ: అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం గ్రామానికి చెందిన నరదల నాగరాజు అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం తన తోటలో పందెం పుంజులు పెంపకం ప్రారంభించాడు,వేరే ప్రాంతం నుండి కొని తెచ్చిన పుంజులలో ఒక పుంజుపిల్ల విచిత్రం గా ఉండటంతో దానిని శ్రద్దగా పెంచాడు,ఇంకా కొద్దీ నెలలలో సంక్రాంతి పండుగ వస్తున్నందున కోడి పందెలా రాయుళ్లు ,పుంజులను చూడటానికి ,నాగరాజు తోటలోకి రావటం, మిగతా పుంజులు చూసి ఈ పుంజును చూసిన వారు ఒక్కసారే విస్తుపోయారు, ఎందుకంటే ఈ పుంజు నాలుగు కాళ్లతో జన్మించి,మంచి హుషారుగా ఉండటం చూసి,వామ్మో ఇదేం పుంజు ఒకవేళ కోడి పందెలలో పాల్గొంటే దీని కి ఎక్కడ కత్తులు కట్టాలి,దీన్ని చూసి మిగతా పుంజులు పోరాడగలవా అని చర్చించుకోంటున్నారు, ఈ నాలుగు కాళ్ల పుంజు గురించి తెలిసిన వారందరూ దీన్ని చూడటానికి ఎగబడుతున్నారు,ఏమైనా బ్రహ్మం గారు చెప్పినట్లే జరుగుతుంది అని కొందరు,ఇదేం వింతరా బాబు అని మరికొందరు,ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడలో అని చర్చించుకోంటున్నారు