ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాల నేపథ్యంలో అధికారలకు మంత్రి పోంగులేటీ పలు సూచనలు…..
భారీ వర్షాల నేపథ్యంలో ఫోన్లో అధికారులతో మంత్రి పొంగులేటి

భారీ వర్షాల నేపథ్యలో పాలేరు ,ఖమ్మం , భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అధికారులతో మొంత తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గత రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం పాలేరు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారుల తో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు.భారీ వర్షాల నేపథ్యంలో అధికారలకు మంత్రి పోంగులేటీ పలు సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, రైతులు రైతులు, పశువుల కాపర్లు వాగులు వంకలు దాటకుండా కట్టడి చేయాలని, అందుకోసం పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని మంత్రి పోంగులేటీ ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రధాన రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయని, ఈ వర్ష ప్రభావంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా నీటిపారుదల శాఖ అధికారులు,సిబ్బంది చెరువుల వద్ద పర్యవేక్షణ గా ఉండాలని మంత్రి పోంగులేటి ఆదేశించారు.అత్యవసర వైద్య సేవల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి కోరారు.అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దని చేపారు …..