News & Views

చర్చ కొత్తగూడెం సింగరేణి : బదిలీపై వెళ్తున్న అజ్మీరా శ్రీనివాస్‌కు ఆర్‌సీహెచ్‌పీ కార్మికుల ఘన వీడ్కోలు

_కార్పొరేట్ సెంట్రల్ స్టోర్స్‌కు బదిలీ - సేవలను కొనియాడిన అధికారులు, యూనియన్ నాయకులు_

 


చర్చ,కొత్తగూడెం సింగరేణి

కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీహెచ్‌పీ (RCHP)లో విశిష్ట సేవలు అందించిన శ్రీ అజ్మీరా శ్రీనివాస్, ఎస్.ఈ. (ఎలక్ట్రికల్ & మెకానికల్) గారికి కార్పొరేట్ సెంట్రల్ స్టోర్స్‌కు బదిలీ అయిన సందర్భంగా కార్మికులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

గురువారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏరియా ఇంజనీర్ లక్ష్మణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు, అధికారులు, యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించి ఆయన అందించిన సేవలను కొనియాడారు.

అధికారులు, యూనియన్ నాయకులు మాట్లాడుతూ, అజ్మీరా శ్రీనివాస్ సంస్థ అభివృద్ధికి, బొగ్గు ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెంపుదలకు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయడంతో పాటు కార్మికులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ఆర్‌సీహెచ్‌పీలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, నూతన బాధ్యతల్లో కూడా అదే స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు లింగా, యశస్వి, యూనియన్ నాయకులు ఎఐటీయూసీ సహాయ కార్యదర్శి గట్టయ్య, ఐఎన్‌టీయూసీ పిట్ కార్యదర్శి శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.