News & Views

చర్చ కొత్తగూడెం : పాత కక్షలతో యువకుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధం కారణమా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో పాత కక్షలు ఓ యువకుడి ప్రాణం తీశాయి.

 

 

చర్చ కొత్తగూడెం:

  1. పాత కక్షలతో యువకుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధం కారణమా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో పాత కక్షలు ఓ యువకుడి ప్రాణం తీశాయి.

నిన్న రాత్రి పాల్వంచలోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అదే గ్రామానికి చెందిన నాగరాజు, కరం శివాజీ అనే ఇద్దరు యువకుల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. కొట్లాట అనంతరం ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న నాగరాజుపై శివాజీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

స్థానికుల కథనం ప్రకారం, శివాజీ కత్తితో రెండు మూడు సార్లు పొడవడంతో నాగరాజు పేగులు బయటకు వచ్చాయి. రక్తపు మడుగులో, కొన ఊపిరితో ఉన్న నాగరాజును స్థానికులు వెంటనే కొత్తగూడెం సర్వేజనా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

*ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.* పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు నాగరాజుకు ఒక చెల్లెలు మాత్రమే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఘటన అనంతరం నిందితుడు శివాజీ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.