News & Views

చర్చ అన్నపురెడ్డిపల్లి : కేరళకు తరలిస్తున్న రూ.44 లక్షల గంజాయి పట్టివేత_

అన్నపరెడ్డిపల్లి పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం - ఇద్దరు నిందితుల అరెస్ట్

_కేరళకు తరలిస్తున్న రూ.44 లక్షల గంజాయి పట్టివేత_

_అన్నపరెడ్డిపల్లి పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం – ఇద్దరు నిందితుల అరెస్ట్_

చర్చ అన్నపరెడ్డిపల్లి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడిశా సరిహద్దు నుంచి కేరళకు కారులో అక్రమంగా తరలిస్తున్న 88.590 కిలోల నిషేధిత గంజాయిని వాహన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.44,29,500 ఉంటుందని అంచనా.

*డీఎస్పీ వెల్లడించిన వివరాలు:*
కొత్తగూడెం డీఎస్పీ ఎల్. ఆదినారాయణ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వాహన తనిఖీల్లో భాగంగా కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడిందన్నారు.

ఈ కేసులో కారు, ఒక సెల్ ఫోన్‌తో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ఒడిశా సరిహద్దు నుంచి కేరళకు గంజాయి తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.