News & Views

చర్చ కొత్తగూడెం బీఆర్‌ఎస్ సభ్యత్వ సదస్సులో రసాభాస_

వనమా రాఘవపై రవీందర్‌రావు వ్యాఖ్యలతో కార్యకర్తల ఆందోళన - కుర్చీలు విరగ్గొట్టి నిరసన_


చర్చ కొత్తగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యకర్తలు ఆందోళనకు దిగి కుర్చీలు విరగ్గొట్టి నిరసన తెలిపారు.

*ఘటన వివరాలు:*
సభా వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావును ఉద్దేశించి జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడారు. “రాఘవేంద్రరావు తన పద్ధతి మార్చుకోవాలి. బీఆర్‌ఎస్ కార్యకర్తలకు చేదోడువాదోడుగా ఉండాలి” అని హెచ్చరించారు.

దీంతో ఒక్కసారిగా వనమా రాఘవేంద్రరావు అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు సభా వేదికపైకి దూసుకొచ్చారు. ఆందోళనకు దిగి కుర్చీలు విరగ్గొట్టి నిరసన వ్యక్తం చేశారు.

*ఎంపీ జోక్యం:*
కార్యకర్తలతో పాటు వేదిక నుంచి బయటకు వెళ్లిపోతున్న వనమా రాఘవేంద్రరావును రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు. అనంతరం ఆయన సముదాయించడంతో రాఘవేంద్రరావు తిరిగి సభా వేదికపైకి వచ్చారు.

ఈ ఘటనతో కొద్దిసేపు సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. నాయకుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.