News & Views

చర్చ సింగరేణి : 7 ఇంక్లైన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల ఆంజనేయ స్వామి విగ్రహం తొలగింపుపై భక్తుల అభ్యంతరం

చర్చ సింగరేణి:

*7 ఇంక్లైన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల ఆంజనేయ స్వామి విగ్రహం తొలగింపుపై భక్తుల అభ్యంతరం*

_“సింగరేణి యాజమాన్యం, యూనియన్ ప్రతినిధుల సమక్షంలో, భక్తులకు సమాచారం ఇవ్వకుండా విగ్రహాన్ని తొలగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు”_

కొత్తగూడెం: 7 ఇంక్లైన్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక భక్తుల కథనం ప్రకారం, సింగరేణి యాజమాన్యం, యూనియన్ ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులతో, భక్తులతో ముందస్తు చర్చలు జరపకుండా విగ్రహాన్ని తొలగించారని ఆరోపిస్తున్నారు. ఇది చారిత్రక ఆలయమని, విగ్రహాన్ని తిరిగి అదే స్థానంలో ప్రతిష్ఠించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

కొందరు భక్తులు మాట్లాడుతూ, VKCM ఓసీ విస్తరణ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రధాన ఆలయానికి కూడా ఇబ్బంది కలుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, లేని పక్షంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం, సంబంధిత యూనియన్ నాయకుల స్పందన తీసుకునేందుకు ప్రయత్నించగా వారి నుంచి వివరణ అందుబాటులోకి రాలేదు.