News & Views

చర్చ జూలూరుపాడు: సాయి ఎక్సలెంట్ పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభం

పాఠశాల ఇంచార్జ్ స్వర్ణలత

చర్చ జూలూరుపాడు,

మండలంలోని సాయి ఎక్సెలెంట్ పాఠశాలలో నందు ప్రపంచ స్థాయిలో తీర్చి దిద్దే విధంగా డిజిటల్ తరగతులు ప్రారంభించడం జరిగిందని పాఠశాల ఇంచార్జ్ స్వర్ణలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని పాఠశాల యాజమాన్యం డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు. పల్లె, పల్లెకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్దేశంతో 2026 -2027 విద్యా సంవత్సరానికి ముందుకు అడుగులు వేసేదానిలో భాగంగా డిజిటల్ క్లాసులను కార్పొరేట్ లీడ్ అనే సంస్థ తో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బట్టికి స్వస్తీ పలుకుతూ తనంతటా తాను పాఠాన్ని అవగాహన చేసుకుంటూ పాఠాన్ని పూర్తిగా అవగాహన కలిగి ఉంటారని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులు విని నేర్చుకోవడం కంటే చూసి నేర్చుకోవడం ద్వారా ఎక్కువ గుర్తుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, నభీన, దుర్గ భవాని, సత్యవతి, రమేష్, ఉదయభాను, కళ్యాణి, ప్రశాంతి, అరుణ, సౌజన్య, హైమావతి, శాంతమ్మ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.