News & Views

చర్చ , సింగరేణి : పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలని కోరుతూ పివికే5 గనిలో మొఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకొని అంబేత్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు

 

  • *పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలని కోరుతూ పివికే5 గనిలో మొఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకొని అంబేత్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు*

*కార్మికుల మెడికల్ అన్ ఫిట్ వల్ల సింగరేణి పై ఆర్ధిక భారం పడిందని అసెంబ్లీ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసిన కార్మిక వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసన తెలిపిన కార్మికులు*

*కార్మిక వ్యతిరేక వ్యాఖ్యలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంఘం ఐఎన్టీయుసి నాయకులు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దొంగ నిరసన దీక్షలు*

చర్చ, సింగరేణి, కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులపై చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా శనివారం ఉదయం పివికే 5 గని కార్మికులు మొఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకుని గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు,అనంతరం అంబేత్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేశారు,కొత్తగూడెం ఏరియాలో పివికే 5 గని కార్మికులు వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వనకి నిరసనసెఘ తగిలించి నల్ల రిబ్బన్లు మొఖానికి కట్టుకుని ప్లే కార్డ్స్ తో నిరసన తెలుపుతూ నల్ల సూర్యులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు,సింగరేణి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా సింగరేణి కార్మికుల కుటుంబల జీవితాలతో చలగటం అందుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనగా మొఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు.కార్మికుల మెడికల్ అన్ ఫిట్ వల్ల సింగరేణి పై ఆర్ధిక భారం పడిందని అసెంబ్లీ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసిన కార్మిక వ్యతిరేక వ్యాఖ్యలను ఖండిస్తున్నామని గని కార్మికులు నిరసన తెలిపారు,సింగరేణి కార్మిక వ్యతిరేక వ్యాఖ్యలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంఘం ఐఎన్టీయుసి నాయకులు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దొంగ నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్యపదమని, ప్రభుత్వానికి చిత్తా శుద్ధి ఉంటే కార్మికులకు పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలని,మరియు అండర్ గ్రౌండ్ లో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్స్ ను సర్ఫేస్ కన్వర్షన్ చేసి ఏరియాలో ఖాళీలు భర్తీ చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమం లో బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు,సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు,పివికే 5 పిట్ కార్యదర్శి భుక్య రమేష్,ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి కమల్,అసిస్టెంట్ ఫిట్ సందీప్ సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్ మహేష్,సుమన్, కుమార్ రావు,జనరల్ షిఫ్ట్ ఇంచార్జ్ సంజీవ్, సుభాష్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ లక్ష్మణ్ జాయింట్ సెక్రెటరీ దేవ సింగ్, గణేష్,నరేష్,ఫక్రుద్దీన్,శివ, వినోద్,సురేష్,సంతానం,దాసరి శీను, నాగార్జున తదితరులు పాల్గొన్నారు