చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా , అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళముందే నేలపాలు…. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులు…

అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళముందే నేలపాలు….
ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులు…
మొంథా భారీ తుఫాన్ కారణంగా బుధవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లినియోజకవర్గంలోని తల్లాడ మండలంలో రైతులు కుదేలవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాను కారణంగా నీటిపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా తమ విలపిస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంట చేతికి రావడంతో కురుస్తున్న వర్షాలకు మొలక ఎత్తే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి వర్షం కారణంగా నేత మరణంతో రైతుల కోసం అంత ఇంత కాదని చెప్పాలి తుఫాన్ చాలా వేగంగా వహించి మండల రైతులను పెద్ద మొత్తంలో ఊబిలోకి నెట్టింది భారీ వర్షాల కారణంగా జనం జీవితాలను దెబ్బతీస్తూ పల్లె ప్రాంతాల్లో విస్తృతంగా పంట పొలాలను నాశనం చేసింది వరి పత్తి మిరప పంటలు తుఫాన్ తో పాటు గాలి వర్షం ముప్పుతో కిందపడిపోవడం వలన రైతులకు భారీగా హార్దిక నష్టం కలిగింది.ఈ సందర్భంగా
రైతులు మమ్మల్ని ప్రభుత్వంఆదుకోవాలని తల్లాడకు చెందిన రైతులుమాట్లాడుతూ..
భారీ తుఫాన్ కారణంగా పంట నష్టపోయామని రైతులు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మండల వ్యాప్తంగా ఉన్న రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో వ్యవసాయ సాగుకు వేలాది రూపాయలు అప్పు తెచ్చి సాగు చేశామని వడ్డీ మందం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఆత్మహత్యలు శరణ్యమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.