చర్చ : సత్తుపల్లి , హత్యా రాజకీయాలను ఖండించండి…

హత్యా రాజకీయాలను ఖండించండి….
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు….
హత్య రాజకీయాలు తో ప్రజా ఉద్యమాలను ఆపలేరు అని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు హత్య ఘటన అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు అన్నారు.
వారి మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనేక ప్రజా ఉద్యమాలకు రైతాంగ ఉద్యమాలకునాయకత్వం వహించిన సామినేని రామారావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో కాంగ్రెస్ మూకల కిరాయి గుండాలు అత్యంత కిరాతకంగా చంపారు. సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా,పార్టీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బాధ్యతలునిర్వహించారు. పాతర్లపాడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా రెండు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. గ్రామంలో రాజకీయంగా సిపిఎం ను ఎదుర్కోలేని, కాంగ్రెస్ గుండాలు కిరాయి గుండాలు తో చoపించారు. మండల కార్యదర్శి గాయం తిరుపతి రావు మాట్లాడుతూ,
సౌమ్యుడు ప్రజలలో కలిసి పోయే మనిషిగా పేరు ఉంది. అనేక ఉద్యమాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్వహించినసందర్భంలో అంకితభావంతో పనిచేశారని చెప్పారు. వారి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు చిట్టిమోదుల కృష్ణయ్య, తడికమళ్ళ చిరంజీవి, దూప్ సింగ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చెమట విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.