
“వందేమాతరమే” దేశభక్తికి స్ఫూర్తి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
“వందేమాతరం” ఆలపించిన పోలీసులు
చర్చ, జగిత్యాల,
అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గీతం వందేమాతరమని ఆనాటి ప్రజల్లో రగిలించిన దేశ భక్తి తోనే నేడు భరతావని స్వేచ్చ యుత దేశ మైందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. నేటితో వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గేయా ఆలాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొని వందేమాతర గేయాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎస్పి అశోక్ కుమార్ మాట్లాడుతూ “వందేమాతరం” మన జాతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన శక్తివంతమైన గేయమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు ఈ గేయం ద్వారా ప్రజల్లో జాతీయ స్పూర్తిని కలిగించారని, ప్రతి భారతీయుడు ఈ గీతం చరిత్రను తెలుసుకొని గౌరవంతో గానం చేయాలి అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు, వేణు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.