చర్చ ,గోదావరిఖని: ర్యాంగిగ్ పాల్పడితే చర్యలు తప్పవు- రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
ర్యాంగిగ్ పాల్పడితే చర్యలు తప్పవు
ర్యాంగిగ్ పాల్పడితే చర్యలు తప్పవు…
రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా…..
చర్చ ,గోదావరిఖని:
ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని,అలాంటి విష సంస్కృతి కి పాల్పడితే కటిన చర్యలు తప్పవని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ర్యాగింగ్ కు పాల్పడితే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని… జూనియర్ల పట్ల సీనియర్లు సోదర భావంతో మెలగాలని మెడికోలకు సూచించారు.శుక్రవారం గోదావరిఖని సింగరేణి మెడికల్ కళాశాల(సిమ్స్)లో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు ను ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని తోటి విద్యార్థులతో సోదర భావంతో మెలగాలని, సీనియర్లు, జూనియర్లు అనే బేదం లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. సీనియర్లు ఒకప్పడు జూనియర్లమనే అనే విషయం మరచిపోవద్దన్నారు.తోటి విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడి,తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.ఎంతో కష్టపడి చదివి మెడికల్ సీటు సంపాదించి కేసులు నమోదై జైలుకు వెలితే తల్లిదండ్రులు ఎంత బాదపడుతారొ గుర్తు పెట్టుకోవాలన్నారు.ర్యాగింగ్ భూతాన్ని కళాశాల నుంచి తరిమి వేయాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే సంబందిత పోలిస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.