News & Views

చర్చ, జగిత్యాల: ఇందిరమ్మ పథకాలతో పల్లెల్లో నేడు పండుగ – ఇళ్ల పట్టాలు, చీరెలను పంపిణి చేసిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ పథకాలతో పల్లెల్లో నేడు పండుగ

ఇళ్ల పట్టాలు, చీరెలను పంపిణి చేసిన ఎమ్మెల్యే

చర్చ, జగిత్యాల: ఇందిరమ్మ సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ది చేకూరుతొందని, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, చీరేల పంపిణితో పల్లెల్లో నేడు పండుగ వాతావరణం నెలకొందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 21 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు.
9మంది ఆడబిడ్డలకు మంజూరైన 9 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మీ చెక్కులు,
7 గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2లక్షల రూపాయలు విలువగల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 13 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
రూరల్ మండలానికి చెందిన 69 మందికి మంజూరైన 69 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మీ చెక్కులు, 50 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 13 లక్షల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెర్వో రామ్మోహన్, ఎంపీడీవో లు రమాదేవి,విజయ లక్ష్మి, ఎంపీవో వాసవి, అర్బన్, రూరల్ మండల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.