News & Views

చర్చ, హైదరాబాద్ : మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటాం: వికల్ప్ పేరుతో లేఖ?

చర్చ, హైదరాబాద్ : మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటాం: వికల్ప్ పేరుతో లేఖ?

హైదరాబాద్: మావోయిస్టు వికల్ప్‌ పేరుతో మరో కీలక ప్రకటన విడు దల చేశారు. మావోయిస్ట్ అగ్ర నేతలు దేవ్‌జీ, రాజిరెడ్డిలు మాతో ఉన్నారన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనడం అవాస్తవమ న్నారు. చికిత్స కోసం హిడ్మా విజయవాడ వెళ్లారని, విజయవాడలోని కలప, స్మగ్లర్లు మాకు నమ్మ క ద్రోహం చేశారన్నారు.

పోలీసులు హిడ్మాను సజీవంగా పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారన్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ బూటకమని, 13 మందిని పట్టుకుని ఎపి పోలీసులు కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మావోయి స్టు అగ్రనేతల ఆశయాలను కొనసాగిస్తా మని,ఆ లేఖలో పేర్కొన్నారు.