News & Views

చర్చ, జగిత్యాల : పంచాయతీ ఎన్నికల జగిత్యాల అసెంబ్లీ ఇంచార్జి గా భోగ శ్రావణి

పంచాయతీ ఎన్నికల జగిత్యాల అసెంబ్లీ ఇంచార్జి గా భోగ శ్రావణి

చర్చ, జగిత్యాల : జగిత్యాల జిల్లా లోని మూడు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల ఇంచార్జ్ లను బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచ కొండ యాదగిరి బాబు నియమించారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని పంచాయతీ ఎన్నికల ఇంచార్జ్ గా భోగ శ్రావణి తోపాటు పెద్ద గంగారాం, పడాల తిరుపతి లను నియమించారు. అలాగే ధర్మ పురి అసెంబ్లీ పరిధిలోని పంచాయతీ ఎన్నికల ఇంచార్జ్ లుగా కన్నం అంజయ్య, మర్రి పెల్లి సత్యం, దొనకొండ నరేష్ లను నియమించారు. కోరుట్ల అసెంబ్లీ పరిధిలోని పంచాయతీ ఎన్నికల బీజెపి ఇంచార్జ్ లుగా డా. రఘు, నరేందర్ రెడ్డి, జక్కుల జగదీశ్వర్ లను నియమించారు. జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేయాలని యాదగిరి బాబు కోరారు.