చర్చ,పెద్దపల్లి: నూతన సర్పంచులకు సన్మానం..
చర్చ,పెద్దపల్లి: నూతన సర్పంచులకు సన్మానం..
- గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి..
- నూతన సర్పంచులకు ఎమ్మెల్యే విజయరమణ రావు సూచన.
కాల్వశ్రీరాంపుర్ మండలంలో మొదటి విడత ఎన్నికలలో గెలుపొందిన వివిద గ్రామాల సర్పంచులకు శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సర్పంచులు, వార్డు మెంబర్లను ఎమ్మెల్యే విజయ రమణారావు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
సర్పంచులు గ్రామములో వీధిలైట్లు, శానిటేషన్, గ్రామస్తులకు త్రాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. గెలిచిన 19 మంది కాంగ్రెస్ సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సర్పంచుల గెలుపు వెనుక పార్టీ నాయకులు కార్యకర్తల సమిష్టి కృషి మరువలేదని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. బాధ్యతగా పనిచేస్తూ గ్రామలను అభివృద్ధి చేయాలన్నారు.ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేణ సదయ్య, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.