News & Views

చర్చ : బిజెపి,కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం !..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిజెపి,కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

చర్చ : బిజెపి,కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం !..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిజెపి,కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో ముస్లిం లకు స్థానం కల్పించడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపి శ్రేణులు పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే ముస్లింలకు రిజర్వేషన్ లు కల్పిస్తే మీకెందుకు అభ్యంతరం అంటూ బిజెపి శ్రేణులను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు..