చర్చ: పెద్దపల్లి: జనవరి 10 లోపు స్వయం ఉపాధి కొరకు ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- జనవరి 10 లోపు స్వయం ఉపాధి కొరకు ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపెల్లి జిల్లాలో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ లకు స్వయం ఉపాధి, పునరావాసం కొరకు రాష్ట్ర ప్రభుత్వం చే వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ ద్వారా మన జిల్లాకు 2 యూనిట్ల ద్వారా లక్ష యాభై వేల రూపాయలు మంజూరు కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
గుర్తింపు కార్డు ఉన్న 18 నుంచి 55 సంవత్సరాల వయసు గల ట్రాన్స్ జెండర్ లు స్వయం ఉపాధి యూనిట్ల కొరకు జనవరి 10 లోపు ఐడిఓసి రూమ్ నెంబర్ 114 లో గల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తుల సమర్పించాలని, ఇతర వివరాలకు 994949461, 9440852495 నెంబర్ నందు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.