
చర్చ, జగిత్యాల: విద్యుత్ శాఖలో ఉద్యోగం లో చేరాడు. కాలక్రమేణా ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని యూనియన్ లో సభ్యుడైన లైన్ ఇన్స్ పెక్టర్ తిరుపతి ఆర్టీజన్ల సమస్యలపై పోరాటం చేశారు. గత బి. ఆర్. ఎస్ ప్రభుత్వం లో న్యాయం దొరకలేదని ఆవేదన చెందాడు. ప్రభుత్వం మారింది. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీజన్ కార్మికుల ను పర్మినెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని దీనిపై ఆలస్యం జరుగుతోందని యూనియన్ నాయకులతో ప్రశ్నించాడు. జగిత్యాల, రాష్ట్ర నాయకత్వం లో స్పందన కరువైందని గుర్తించిన లైన్ మెన్ తిరుపతి ఐ.ఎన్.టి.యు.సి.కి 327 రాజీనామా చేసి తన బాట ను ఎంచుకొన్నాడు. ఆర్టీజన్ కార్మికులకు న్యాయం చేయడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతానని ప్రకటించారు