చర్చ కొత్తగూడెం : కొత్తగూడెంలో మోస్తరు వర్షం.. ప్రజలకు ఉపశమనం
_ఉరుములు మెరుపులతో కురిసిన వాన - రోడ్లన్నీ జలమయం_
చర్చ కొత్తగూడెం,:
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కోల్టౌన్ కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. అధిక వేడిమి, ఉక్కపోతలతో అల్లాడుతున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది.
వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వర్షం కురవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షంతో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. దీంతో గత కొన్ని రోజులుగా అధిక వేడిమి, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలిగింది.