News & Views

చర్చ కొత్తగూడెం : వర్షాకాలం: పాములతో జర భద్రం… ఏజెన్సీలో జనావాసాల్లోకి విషసర్పాలు

రెండు రోజుల్లో 9 పాములు రెస్క్యూ: ప్రాణధార ట్రస్ట్ అధ్యక్షుడు సంతోష్ హెచ్చరిక

 

 

చర్చ భద్రాద్రి కొత్తగూడెం:

*బాడీ:*
భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ జిల్లాలో వర్షాలు కురుస్తున్న వేళ జనావాసాల్లో పాములు అధికంగా తిరుగుతున్నాయని ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ హెచ్చరించారు.

గత రెండు రోజుల్లోనే 7హిల్స్ ఏరియా, ప్యూన్ బస్తీ, రామవరం, బాబుక్యాంప్, బర్మా క్యాంప్, పాల్వంచ ప్రాంతాల్లో *6 విష సర్పాలు, 3 విష రహిత సర్పాలను* బంధించి అడవిలో సురక్షితంగా వదిలినట్లు ఆయన తెలిపారు.

*వర్షాకాలంలో పాములు ఎందుకు బయటికి వస్తాయి?*
ప్రత్యేకించి వర్షాకాలంలో సర్పాలకు ఆహారం, సంతానం కోసం ఎక్కువగా బయటికి వస్తాయని సంతోష్ వివరించారు. వాన నీరు పుట్టల్లోకి చేరడం, ఎలుకలు, కప్పలు ఇళ్లలోకి రావడంతో వాటిని వేటాడేందుకు పాములు జనావాసాల్లోకి వస్తున్నాయన్నారు.

*తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*
1. *ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.* పాములకు మరుగు కల్పించే పనికిరాని వస్తువులు, చెత్త, రాళ్ల కుప్పలు తొలగించాలి.
2. *రాత్రిళ్లు వెలుగు ఉండేలా చూసుకోవాలి.* చీకట్లో పాములు కనిపించవు.
3. *వ్యవసాయ పనులకు వెళ్లేవారు కాళ్లకు గమ్ షూస్ ధరించాలి.* రాత్రిళ్లు తప్పనిసరిగా టార్చ్ లైట్‌తో వెళ్లాలి.
4. *పాము కనిపిస్తే:* అవకాశం ఉంటే పామును ఫోటో తీయడం లేదా దాని పైనున్న మచ్చలు, రంగు గుర్తుపెట్టుకోవడం వల్ల రెస్క్యూ టీమ్‌కు వెంటనే అప్రమత్తం చేయడానికి వీలు ఉంటుంది.

*అత్యవసరంలో సంప్రదించండి:*
పాము కనిపిస్తే కొట్టవద్దని, వెంటనే అటవీ శాఖ లేదా ప్రాణధార ట్రస్ట్‌కు సమాచారం అందించాలని సంతోష్ సూచించారు.